మన ప్రభుత్వం ఉన్నా సంపాదించుకోలేకపోతున్నాం : కార్యకర్తలతో మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

మన ప్రభుత్వం ఉన్నా సంపాదించుకోలేకపోతున్నాం : కార్యకర్తలతో మంత్రి

June 29, 2022

ఏపీలో వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుని నియోజకవర్గ పార్టీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా..‘గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నుంచి కార్యకర్త వరకు అందరూ సంపాదించుకున్నారు. ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీ మెంబరే అమలు చేసేవారు. అలాంటి భావనే మన కార్యకర్తల్లో కూడా ఉంది. అయితే సీఎం జగన్ పారదర్శక విధానాల వల్ల అది మనకు సాధ్యపడడం లేదు. అందుకే కొంతమంది నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. ఆ నిరుత్సాహం నాకు కూడా ఉంది. ఇది వాస్తవం’ అని వ్యాఖ్యానించారు. అయితే తాను కూడా నిరుత్సాహం చెందానంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.