Minister Dayakar Rao unveiled a hundred feet national flag in Thorrur
mictv telugu

తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతీయ జెండా.. ఎగరేసిన మంత్రి

August 29, 2022

Minister Dayakar Rao unveiled a hundred feet national flag in Thorrur

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతయ జెండా రెపరెపలాడింది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేశారు. ఇది 291 అడుగుల ఎత్తులో ఉంది. తెలంగాణలో ఇదే ఎత్తయిన జెండా కాగా, ఇప్పుడు రెండో అతి ఎత్తయిన జాతీయ జెండా వరంగల్ జిల్లాలో ఏర్పాటైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే అత్యంత ఎత్తైన జాతీయ జెండా కాగా, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు.

జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ జెండా ఎత్తు 100 అడుగులు. 30 అడుగుల వెడల్పుతో సుమారు 20 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేశారు. అంతేకాక, భద్రత కోసం ఫెన్సింగ్, గార్డెనింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక విద్యార్ధులు, కళాకారులతో కలిసి మంత్రి సంబరంగా డ్యాన్సులు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం, ఐక్యత కోసం ధన, మానాలను త్యాగం చేసిన వీరులందరినీ స్మరించుకొని నవ భారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే గొప్ప సంకల్పంతో జెండా ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. జాతి స్పూర్తిని రగిలించే విధంగా ఏర్పాటు చేసిన ఈ జెండా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. కాగా, దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా జమ్ము కశ్మీర్‌లోని లేహ్‌లో ఉంది.