సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి హోమం - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి హోమం

March 14, 2022

 bhhi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులు పూజలు, హోమాలు చేస్తున్నారు. కేసీఆర్ ఇటీవల స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా, వైద్యులు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మంత్రులు అనేక రకాల పూజలు చేస్తున్నారు. తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం జరిపించారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సురభి వాణీదేవి, తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలనీ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ ఈ హోమం నిర్వహించినట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కాగా, అంతకుముందు స్పీకర్ పోచారం దంపతులు టీటీడీ దేవాలయంలో హోమం జరిపించారు. అలాగే మహబూబ్ నగర్‌లోని అబ్దుల్ ఖాదర్ దర్గాలో పార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చాదర్ సమర్పించారు.