ప్రభుత్వ కార్యక్రమాలో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతు అవతారం ఎత్తారు. తన సొంత పొలంలో దుక్కి దున్ని నాట్లు వేశారు. తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా పర్వతగిరిలోని సొంత భూమిలో జరుగుతున్న వ్యవసాయ పనులను చూసేందుకు ఎర్రబెల్లి వెళ్లారు. అనంతరం పనులకు పూనుకున్నారు. ప్యాంటును పైకి ఎత్తి పొలంలో దిగిపోయారు. మహిళా కూలీలతో నాట్లు వేస్తూ పాటలు పాడారు. అనంతరం అరక చేతబూని ఎడ్లను అయిచ్చితూ పొలం దున్నారు. మంత్రి దయాకర్రావు స్వయంగా పొలం పనులకు పూనుకోవడం అక్కడివారిన ఆశ్చర్యపరిచింది. మంత్రి పొలం పనులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. గతంలోనూ పిల్లలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి చేపలు పట్టారు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ కార్యక్రమానికి వెళ్తుండగా చేపలు పిల్లలు చేపలు పట్టడాన్ని గమినించి కారు దిగిపోయారు. అనంతరం వారితో కలిసి చేపలకు గాలం వేశారు.