అసెంబ్లీ ముట్టడి.. దిగజారుడుతనం - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీ ముట్టడి.. దిగజారుడుతనం

October 25, 2017

కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఈ నెల 27 ముట్టడి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగితే కాంగ్రెస్సే బాధ్యత వహించాలన్నారు.

రాజకీయ అసహనంతోనే ఆ పార్టీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీ భావ దారిద్ర్యం లో ఉంది.  సమావేశాలు మొదలయ్యే తొలిరోజే ఎవరైనా అసెంబ్లీని ముట్టడిస్తారా? సభలో మాట్లాడే అవకాశం లేని ప్రజా సంఘాలో, మరెవరో అసెంబ్లీ ని ముట్టడిస్తారు కానీ… ప్రధాన ప్రతిపక్షం ఇలా చేస్తుందా?’ అని ప్రశ్నించారు.  బీఏసీ సమావేశం జరగకుండానే వీధి పోరాటానికి దిగడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.  జానారెడ్డి లాంటి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.  అసెంబ్లీలో ఏ అంశంపై అయినా, ఎన్ని రోజులైనా చర్చించేందుకు సర్కారు సర్వసన్నద్ధంగా ఉందన స్పష్టం చేశారు  3-4 వారాలు సమావేశాలు నిర్వహించాలన్న యోచనతో ఉన్నామన్నారు.