బీజేపీ మంత్రి ఔదార్యం.. క్షతగాత్రులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి.. - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ మంత్రి ఔదార్యం.. క్షతగాత్రులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి..

June 29, 2020

BJP MP.

ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలపై నిత్యం స్పందించే నేతలు చాలా అరుదుగా ఉంటారు. ప్రజానేత అనే పదాన్ని కేవలం వాడుకున్నారు తప్పితే.. పనుల్లో చూపించలేదు. కానీ, ఓ నేత గాయాల పాలైన ఇద్దరు వ్యక్తులను తన వాహనంలో ఆసుపత్రికి పంపించి నిజమైన జననేత అనిపించుకున్నారు. రాజస్థాన్‌లోని షేర్‌గఢ్ ప్రాంతంలో బైకు అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలంలో రెండు బైకులు, ఇద్దరు వ్యక్తులు చెల్లాచెదురుగా పడిఉన్నారు. వారికి చేయూతను అందించడానికి అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. 

అప్పుడే దేవుడిలా కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెఖావత్ జోధ్‌పూర్ నియోజకవర్గం పర్యటనకు ఆ రహదారి గుండా కాన్వాయ్‌లో వెళ్తున్నారు. వెళ్తూ రోడ్డు పక్కనే గాయాలతో పడిఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి ఆయన చలించిపోయారు. వెంటనే సహాయక చర్యలకు పూనుకున్నారు. వారిని దగ్గరుండి తన వాహనంలో ఆసుపత్రికి తరలించి.. వారి ప్రాణాలు కాపాడారు. అంతేగాకుండా ఆసుపత్రికి ఫోన్ చేసి గాయాలైన వ్యక్తులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు చెప్పారు. ప్రమాదంలో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన మంత్రి గజేంద్రసింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. నిజమైన జననేత అంటూ కామెంట్లు చేస్తున్నారు.