రూ. 2.6 కోట్ల సామగ్రిని దళితబంధు కింద పంపిణీ చేసిన గంగుల - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 2.6 కోట్ల సామగ్రిని దళితబంధు కింద పంపిణీ చేసిన గంగుల

January 21, 2022

001

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కింద రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు పలువురు లబ్ధిదారులకు వివిధ రకాల సామగ్రని పంపిణీ చేశారు. వీటిలో 6 హార్వేస్టర్లు, 3 జేసిబీలు, 1 డీసీఎం వ్యాను ఉన్నాయి. వీటి విలువ రూ. 2.60 కోట్లు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద వీటిని పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిన్న డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేసిన వారు నేడు దళిత బంధు పథకం ద్వారా యజమానులుగా మారడం అభినందనీయమని అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కే కె. చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ది చెందుతారని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

001

‘దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగింది. 24 మంది లబ్దిదారులకు 10 యూనిట్లుగా, 6 హార్వెస్టర్లు, 3 జేసీబీలు, 1 డీసీఎం వ్యాన్ అందించాం ఒక్కో హార్వెస్టర్ రూ.లు 22 లక్షలు, ఒక్కో జేసిబి రూ.లు 34 లక్షలు, డిసిఎం వ్యాన్ రూ.లు 24 లక్షలు’ అని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హార్వేస్టర్లు నడిపి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాల కిషన్, సుంకె రవి శంకర్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీ.వి. రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.