'Minister Gangula Kamalakar.. Karimnagar Dawn': Sharmila
mictv telugu

‘మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్ డాన్’: షర్మిల

November 16, 2022

ఎన్నికల్లో గెలిచి అధికారం సంపాదించుకున్న ప్రజాప్రతినిధులు.. ప్రజా సమస్యలు పట్టించుకోవడం మానేసి ఆస్తులను కూడబెట్టే పనిలో ఉన్నారని విమర్శించారు వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో కరీంనగర్​లో జరిగిన బహిరంగసభలో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్​పై విరుచుకుపడ్డారు. గ్రానైట్‌, ఇసుక మాఫియా తప్ప ప్రజల గురించి మంత్రి గంగుల కమలాకర్ పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోయిందని షర్మిల ఆరోపించారు.

ఈడీ, ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నా టీఆర్ఎస్ అధిష్ఠానం నోరు మెదపడం లేదంటే.. ఈ మాఫియాలో అందరికి వాటా ఉన్నట్లే కదా అని ప్రశ్నించారు. గంగుల కమలాకర్ ముదిరి రంగుల కమలాకర్​గా మారి కరీంనగర్​కి డాన్ అయ్యాడన్నారు. గ్రానైట్, ఇసుక, గుట్కా మాఫియాలు, భూకబ్జాలకు పాల్పడుతున్న వాడిని డాన్ అనే అంటారన్నారు.

కరీంనగర్‌లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. బండి సంజయ్ నీ సొంత ఇలాకాలో ఇంత అవినీతి జరుగుతుంటే ఎందుకు గొంతు మెదపడం లేదని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ అంతర్గతంగా ఒక్కటేనని వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు.