minister gangula reddy ed rides issue
mictv telugu

మంత్రి గంగులపై నేనే ఈడీకి ఫిర్యాదు చేశా : లాయర్ మహేందర్ రెడ్డి

November 9, 2022

minister gangula reddy ed rides issue

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ నివాసం, ఆయన వ్యాపార సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు చేపట్టింది. మంత్రి కుటుంబం దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ సోదాలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసుల సమక్షంలో ఐటీ, ఈడీ అధికారులు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక గంగుకమలాకర్ అవినీతిపై ఈడీ అధికారులక తానే ఫిర్యాదు చేసానని బీజేపీ లాయర్ మహేందర్ రెడ్డి తెలిపారు..

మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరగుతున్నాయని 2020 లో ఈడీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని షిప్పింగ్ కార్పోరేషన్ చెన్నైని ఈడీ సూచించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయినా ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. సుమారు రూ.749 కోట్లు పన్నుల రూపంలో కట్టాల్సి ఉందన్నారు. గతంలో కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన మహేందర్ రెడ్డి..ప్రస్తుతం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.