Minister Gangula revealed that they want KCR to enter national politics.
mictv telugu

కేసీఆర్ వెంటే వైఎస్ జగన్ కూడా.. మంత్రి గంగులు సంచలన వ్యాఖ్యలు

September 11, 2022

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. తమ రాష్ట్రాల్లోనూ అమలు కావాలని దేశ ప్రజలందరూ కోరుతున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు కేసీఆర్‌ అయుధంగా మారాలని డిమాండ్‌ వస్తోందని గంగుల చెప్పారు. అందుకే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తాము కోరుతున్నట్టు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించే అన్ని పార్టీల నేతలను కేసీఆర్ కలుస్తారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేసీఆర్ తో కలిసి వైఎస్ జగన్ కూడా నడుస్తారని చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. జాతీయ పార్టీ కోసం సన్నాహలు చేసుకుంటున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా జాతీయ పార్టీని ఏర్పాటును కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేసీఆర్ ను కోరారు. హైద్రాబాద్ లో అందుబాటులో ఉన్న టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కోరారు.