నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సర్కార్... - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సర్కార్…

October 25, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డీఎస్సీ షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాస్ రావు నేరుగా ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నోటిఫికేషన్ ఆలస్యమైందని మంత్రి పేర్కొన్నారు.  నవంబర్ 1 నుంచి 16వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజస్)కు డిసెంబర్ 6 నుంచి 10 వరకు, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్)కు డిసెంబర్ 11న పరీక్ష ఉంటుందని, అలాగే 12, 13 తేదీల్లో పీజీ టీచర్స్ రాతపరీక్ష ఉంటుందని మంత్రి అన్నారు.Minister Ganta Srinivasa Rao Release AP DSC Notification Schedule 2018టెట్ కట్ టీఆర్టీ ద్వారా 7,675 ఉద్యోగాలను, ప్రభుత్వ, జెడ్పీ పోస్టులు 4,341, మునిసిపల్ పోస్టులు 1,100, మోడల్ స్కూల్స్ లో 909 పోస్టులు, బీసీ వెల్ఫేర్‌లో 300 పోస్టులు, ఎస్జీటీ 3,666 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 1,625 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్స్ 452 పోస్టులు భర్తీ చేయనున్నారు.   అభ్యర్థులు నవంబర్ 19 నుంచి సెంటర్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. నవంబర్ 17 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తామని, 20 తరువాత హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేయనున్నారు.