Minister Gudivada Amarnath satirical comments on Pawan Kalyan
mictv telugu

అందులో పవన్ కంటే కేఏ పాల్ నయం.. మంత్రి అమర్‌నాథ్ సెటైర్లు

November 1, 2022

 

Minister Gudivada Amarnath satirical comments on Pawan Kalyan

జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కంటే ప్రజాశాంతి పార్టీ పెట్టిన కేఏ పాల్ నయమని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పాల్ కనీసం 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తానంటున్నారని, పవన్ మాత్రం ఆ మాట చెప్పడానికి ధైర్యం లేదన్నారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా జనసేన రాజకీయ పార్టీ కాదని, సినిమా పార్టీ అని సెటైర్లు వేశారు. పవన్ స్టైల్ మాటలు సినిమాల్లోనే పనికి వస్తాయని, ప్రజాస్వామ్యంలో కాదని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పవన్ సీఎం కావాలనుకుంటే పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలంటున్నారని ఆరోపించారు. వైసీపీ కాపులతో సమావేశం పెడితే పవన్ ప్రభావంతో పెడుతున్నట్టు చిత్రీకరిస్తున్నారని, వాస్తవానికి తాము అన్ని వర్గాలతో తరచూ సమావేశాలు పెడుతున్నామని స్పష్టం చేశారు. ముద్రగడ పోరాటం చేసినప్పుడు పవన్ ఎక్కడ పోయాడని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌లు విడిపోవడం, కలుసుకోవడం సహజమేనని అన్నారు. అటు అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో కోర్టు తీర్పుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, టీడీపీ చేస్తున్న నకిలీ పాదయాత్ర మానుకోవాలని తాము కోరుకుంటున్నట్టు అభిప్రాయపడ్డారు.