దేశంలో ఢిల్లీ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటలూ కరెంట్ అందిస్తున్నామని చెప్పారు మంత్రి హరీశ్ రావు. పక్కనే ఉన్న ఏపీలో రోజు 6 గంటల కరెంట్ కోత ఉందని, తెలంగాణలో మాత్రం 24 గంటల కరెంట్ అందిస్తున్నామని అన్నారు. రెప్పపాటు సేపు కూడా కరెంట్ కట్ అన్నదే లేదని, ఇది ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మారుమూల తండాలో కూడా 24 గంటల కరెంట్ విద్యుత్ సరఫరా అవుతోందని అన్నారు.
ఇటీవలె ఏపీలో రోడ్లు సరిగా లేవంటూ లేవంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేశాయి. తాజాగా మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.