కోమటి చెరువు సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించిన హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

కోమటి చెరువు సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించిన హరీశ్ రావు

December 1, 2019

సిద్దిపేట కోమటి చెరువుపై నూతనంగా నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జిని ఆర్థికమంత్రి హరీశ్ రావు, టూరిజం శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కోమటి చెరువు అభివృద్ది ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని అన్నారు. లక్నవరం తర్వాత సిద్దిపేటలో ఇంత పెద్ద సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘కోమటి చెరువు 1997 నుంచి నేటి వరకు ఇంత అభివృద్ది జరిగింది. తెలంగాణాకు గొప్ప పండగ బతకమ్మ పండగ. ఈ పండగ సందర్భంగా మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి చెరువుల వద్దకు వస్తారు. ఈ క్రమంలోనే ఈ చెరువును సుందరంగా తీర్చి దిద్దాము. కోమటి చెరువు సిద్దిపేట ప్రజల ఆస్తి.. దీనిని అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి’ అని హరీశ్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాను నాటి పాలకులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని.. వారికి మిగిలిన ఆహారాన్ని పాత బస్టాండ్ వద్ద పెట్టిన ప్రిజ్‌లో పెట్టండి అని సూచించారు. అన్నదానం కంటే మించిన గొప్ప దానం లేదని అన్నారు. రైతు బజార్ వద్ద ఉన్న మానవత్వపు గదిలో మీకు పనికిరాని బట్టలు వెయ్యండని పిలుపునిచ్చారు. 

Minister Harish Rao.

అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.  సిద్దిపేట గడ్డ చరిత్ర సృష్టించిన గడ్డ అని.. ఈ గడ్డ మీద కేసీఆర్, హరీశ్ రావు పుట్టారని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ మన రాష్ట్రంలో పుట్టకపోతే ఇవాళ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో. ఇక్కడ డెబ్బై ఏండ్లలో గత ప్రభుత్వాలు కేవలం ఏడు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తే..  కేసీఆర్ అయిదు ఆరు ఏండ్లలో వెయ్యి పాఠశాలలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాకుంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా అడ్డంకులు ఉండేవి కన్నీళ్లు వచ్చేవి. తెలంగాణ ఉద్యమం చావు వరకు పోయి తెలంగాణ రాష్టాన్ని కేసీఆర్ తెచ్చిండు.దేశంలో తెలంగాణ అభివృద్దిలో మొదటి స్ధానంలో ఉంది. మంత్రులుగా రోజుకు 500, 600 కిలోమీటర్లు తిరిగి అభివృద్దిలో  కేసీఆర్ బాటలో నాడుస్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పేర్లు మార్చుకుంటూ అధికారంలోకి రావాలని చూస్తున్నారు.ఎన్నో పోరాటాల వలన తెలంగాణ వచ్చింది. సిద్దిపేట ప్రజలకు ఏది కావాలన్నా మీ ముందుకు తెచ్చే నాయకుడు ఉన్నాడు. సీయం కేసీఆర్ కన్ను ఎప్పుడైనా సిద్దిపేట ప్రజల పైన ఉంటుంది. ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌కు చిన్న మచ్చ లేకుండా పనిచేస్తాం’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.