సింగూర్ ప్రాజెక్ట్ వద్ద హరీశ్.. పరిస్థితి సమీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

సింగూర్ ప్రాజెక్ట్ వద్ద హరీశ్.. పరిస్థితి సమీక్ష

October 15, 2020

Minister harish rao on singur project

మంజీర నది పరవళ్లతో నిండుకుండలా మారిన సింగూరు ప్రాజెక్టును మంత్రి హరీశ్ రావు ఈ రోజు పరిశీలించారు. ఆయకట్టు కింద ఉన్న 170 చెరువుల్లో 100 చెరువులను నింపుతామని చెప్పారు. వరద పరిస్థితి, పంటనష్టంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, నీటిపారుదల, రోడ్ల శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కూడా మంత్రి వెంట ఉన్నారు. 

అందోల్, పుల్కాల్ మండలాల్లో చెరువులను నింపాలని, దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేయాలని హరీశ్ ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న పంటలను గుర్తించి నివేదిక ఇవ్వాలని, నష్టపరహారం చెల్లిస్తామని చెప్పారు. కొన్ని వంతెనలు దెబ్బతినడంతో రూ. 45 కోట్ల నష్టం జరిగింది, 144 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 135 కోట్లతో వాటిని బాగు చేస్తామని వివరించు. అందోల్, నారాయణ ఖేడ్ హైవేలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్యలు తలెత్తాయని మందలించారు. వర్షాలు, వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు కూడా నష్టపరిహారం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. యాసంగిలో సింగూరు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు 40 వేల ఎకరాలకు నీరందిస్తామనని వెల్లడించారు.