బర్త్ డే విషెస్ చెప్పడానికి రావొద్దు.. మంత్రి హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

బర్త్ డే విషెస్ చెప్పడానికి రావొద్దు.. మంత్రి హరీశ్ రావు

June 3, 2022

ఈ ఏడాది తన పుట్టిన రోజున మిత్రులు, అభిమానులెవరూ హైదరాబాద్‌ గాని, సిద్దిపేటకుగానీ రావొద్దని తెలంగాణ వైద్యఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్‌రావు గురువారం ట్విటర్‌ ద్వారా కోరారు. తనపై ఉన్న ప్రేమాభిమానాలను సేవా కార్యక్రమాల ద్వారా చాటాలన్నారు. తనకు బర్త్ డే విషెస్ పంపిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన హైదరాబాద్, సిద్దిపేటలో లేనందునే అభిమానులు, కార్యకర్తలను తన ఇంటి వద్దకు రావొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి.. మంత్రి హరీశ్‌రావు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.