త్వరలోనే టీచర్ల రిక్రూట్‌మెంట్ :హరీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే టీచర్ల రిక్రూట్‌మెంట్ :హరీష్ రావు

November 20, 2022

త్వరలోనే ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. . సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో పీఆర్‌టీయూఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి.. హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. త్వరలో ఎంప్లాయీస్‌ హెల్త్ కార్డు విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని కొందరు కూహానా మేధావులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

ప్రతి రంగంలో దేశానికే అదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. రాష్ట్రం వచ్చిన నాడు ఎంబీబీఎస్‌ సీట్లు 850 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 2950కి పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు మంత్రి హరీష్ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో పది శాతం కేవలం విద్యపై ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మన ఊరు – మన బడి ద్వారా అన్ని పాఠశాలలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.