Minister Harish Rao's Strong Reply To PM Narendra Modi's Comments
mictv telugu

ప్రధాని మోదీ కామెంట్స్‌కి హరీష్ రావ్ స్ట్రాంగ్ రిప్లై

November 13, 2022

ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌ రావు ఘాటుగా స్పందించారు. మోడీ జీ అంటూ ట్విట్టర్‌ వేదికగా మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు. మరీ ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు సీఎం కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసుంటాయని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు.

‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అంటున్నారు. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోదీ జీ.. దేశానికీ, తెలంగాణకు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోదీ జీ..’ అని మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు.