Minister IK REDDY VS Bandi Sajay..Political Heat In Telangana 
mictv telugu

బండి వర్సెస్ ఐకేరెడ్డి..సై అంటే సై

December 5, 2022

ఉత్తర తెలంగాణలో రాజకీయం రాజుకుంది. టీఆర్ఎస్ బీజపీ మధ్య మళ్లీ మాటలమంటలు రేగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ కు సై అన్నారు. 10 రోజులు టైమ్ ఇస్తా..దమ్ముంటే నా చిట్టా బయటపెట్టు అని ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిసవాల్ చేశారు.

బండి భగభగలు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నిర్మల్ జిల్లాలో బండి పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దమ్ముంటే లిక్కర్ కేసులో కవిత నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ చేశారు. విచారణకు సహకరించకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ తెరతీస్తున్నారని ఆరోపించారు. కవితను అరెస్టు చేస్తే తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేశారని సెంటిమెంట్‌ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బండి సంజయ్ ఆరోపణలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఉద్దేశించి”నీ అవినీతి ,కబ్జాల చిట్టా మా దగ్గర ఉంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అంతుచూస్తాం.మంత్రి ఐకేరెడ్డి అల్లుడి కబ్జాలకు అంతేలేదు. మంత్రిపై విచారణ చేయాల్సిందే. చలాన్ల పేరిట నిర్మల్ పోలీసులు రోజుకు లక్ష రూపాయలు వసూలు చేయాలట.11 ఏళ్లుగా తిష్టవేసి డీఎస్పీ కిందస్థాయి సిబ్బందిని వేధిస్తున్నాడు.ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మల్ సంగతేంటో నేను చూస్తా” అని బండి సంజయ్ అన్నారు.

ఐకే రెడ్డి ప్రతి సవాల్

బండి సంజయ్ చేసిన ఆరోపణలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. “10రోజులు టైమ్ ఇస్తా..నా చిట్టా బయటపెట్టు.ఆరోపణలు రుజువు చేయాలని నేనూ సవాల్ చేస్తున్నా.జనానికి ఏం చేశారో బండి కూడా చెప్పాలి.పిచ్చి మాటలు మాట్లాడితే తరిమికొడతారు”అని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

రాజకీయ వేడి

టీఆర్ఎస్ బీజేపీ నేతల పరస్పర ఆరోపణలతో ఉత్తర తెలంగాణ వేడెక్కింది. సవాళ్లు-ప్రతిసవాళ్లపై జోరుగా చర్చ జరుగుతోంది. గతవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల వ్యాఖ్యలపై రచ్చ రచ్చ జరిగింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా షర్మిల వాహనాల్ని టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆ వాహనాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి షర్మిల హంగామా చేశారు.సీఎం కేసీఆర్‌కు వీటిని చూప్తిస్తానని ప్రగతిభవన్ వెళ్లే ప్రయత్నం చేశారు. సోమాజీగూడలో షర్మిలను వాహనంతో సహా పోలీసులు లిఫ్ట్ చేశారు.

కవిత వర్సెస్ అర్వింద్

అంతకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ బీజేపీ ఎంపీ మధ్య వార్ నడిచింది. కవితను చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన బీజేపీ ఉంపీ అర్వింద్.. కవిత బీజేపీలో కాదు..కాంగ్రెస్‌లో చేరేందుకే ఖర్గే ఆఫీసుకు వెళ్లారని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కవిత ఫైర్ అయ్యారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానన్నారు. కవిత మీడియాతో మాట్లాడుతుంండగా హైదరాబాద్‌లో అర్వింద్ పై ఇంటిపై దాడి జరిగింది. ఆయన ఇంట్లో ఫర్నిచర్, అద్దాల్ని ధ్వంసం చేశారు. దీనిపై అర్వింద్ రెండు కేసులు పెట్టారు. తెలంగాణలో నేతల మధ్య మాటల మంటలు కొన్నిసార్లు దాడులకు దారితీస్తున్నాయి. అసలే ముందుంది ఎన్నికల కాలం..ఇంకెన్ని ట్విస్టులుంటాయో…