minister jogi ramesh comments on sc,st and bc
mictv telugu

ఎస్సీ, ఎస్టీ, బీసీలు వైసీపీకి ఓటు వేయాల్సిందే : మంత్రి జోగి రమేష్

October 28, 2022

ఏపీ మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకుంటే తప్పు చేసినవారవుతారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం పూర్తిగా అమలు చేస్తున్న పార్టీ తమదంటూ చెప్పుకొచ్చారు. శుక్రవారం పల్నాడు జిల్లా అమరావతి మండలం పెద్దమద్దూరు వద్ద రహదారి పనులను ఆయన ప్రారంభించారు. స్థానిక ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, నంబూరు శంకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై మంత్రి విమర్శలు గుప్పించారు. పరిపక్వత లేని రాజకీయాలు చేస్తూ యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అలాగే పది టీఎంసీల నిల్వతో కృష్ణా నదిలో రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.