లోకేష్ ప్రశ్నలకు బదులు చెప్పడం ఇబ్బందిగా ఉంది : మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

లోకేష్ ప్రశ్నలకు బదులు చెప్పడం ఇబ్బందిగా ఉంది : మంత్రి

May 16, 2022

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవసాయ రంగంపై ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. నారా లోకేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి తనకే ఇబ్బందిగా ఉందని వ్యాఖ్యానించారు.

‘అసలు లోకేష్‌కు రైతుకు, కౌలు రైతుకు తేడా తెలుసా? ఆయనేమైనా హరిత విప్లవ పితామహుడా? లేక వ్యవసాయ రంగ నిపుణుడా? మాజీ సీఎం కుమారుడైనంత మాత్రాన ఏది పడితే అది అడిగేస్తారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఈ సందర్భంగా మంత్రి రైతులకు సూచించారు.