KTR and Harish Rao Delhi Tour Head Of MLC Kavitha May Arrest In Delhi Liquor Scam
mictv telugu

Breaking News : రేపు కవిత అరెస్ట్..? ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు

March 10, 2023

 KTR and Harish Rao Delhi Tour Head Of MLC Kavitha May Arrest In Delhi Liquor Scam

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ తరువాత కవితను కూడా ఈడీ అరెస్ట్ చేస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో సిఎం కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ పై నాయకులకు హింట్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవి చంద్ర తరువాత తన బిడ్డ కవిత దాకా వచ్చారని, ఏం చేసినా బీజేపీ వదిలేలా లేదని కేసీఆర్ చెప్పినట్లు ఆఫ్ ది రికార్డ్ న్యూస్ బయటికొచ్చింది. ఈడీ విచారణ తరువాత కవితను అదుపులోకి తీసుకొవచ్చన్న అనుమానంతో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావులను ఢిల్లీ వెళ్లాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. చెల్లెలికి మోరల్ సపోర్ట్ గా అన్న కేటీఆర్, అరెస్ట్ తరువాతి పరిణామాలను డిల్ చేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్ రావులు ఢిల్లీకి టేకాఫ్ అవుతున్నారు. కవిత బినామీ అని ఈడీకి చెప్పిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై తన స్టేట్ మెంట్ ను వాపస్ తీసుకోవడం, ఢిల్లీ కోర్టు ఈడీకి నోటీసులు ఇవ్వడంతో లిక్కర్ స్కాం దర్యాప్తు యూ టర్న్ తీసుకుంది. పిళ్లై స్టేట్ మెంట్ వెనక్కి తీసుకోవడంతో కవిత అరెస్ట్ ను ఆపేందుకు లీగల్ గా ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం.