Minister KTR assured to solve the problems of VRAs
mictv telugu

VRAల సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ హామీ

September 13, 2022

గ‌త కొన్ని రోజులుగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఉద్య‌మిస్తున్న వీఆర్ఏల‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం చ‌ర్చ‌లు జ‌రిపారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఓ వైపు నిరవ‌ధిక నిరాహార దీక్ష‌లు కొన‌సాగిస్తున్న వీఆర్ఏలు మంగ‌ళ‌వారం అసెంబ్లీ ముట్ట‌డికి య‌త్నించారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ ముట్ట‌డికి వ‌చ్చిన వీఆర్ఏల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో వీఆర్ఏల‌తో కేటీఆర్ చ‌ర్చ‌ల‌కు సిద్ధం కాగా…మంత్రి ఆహ్వానాన్ని మ‌న్నించి వీఆర్ఏలు కూడా చ‌ర్చ‌ల కోసం కేటీఆర్ వ‌ద్ద‌కు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా ఉద్యోగాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, వేత‌నాల పెంపు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను కేటీఆర్‌ ముందు వీఆర్ఏలు పెట్టారు. వీటిపై దృష్టి సారించిన మంత్రి… వీఆర్ఏల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ నెల 20న మ‌రోమారు ఈ అంశాల‌పై స‌మ‌గ్రంగా వీఆర్ఏల‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో వీఆర్ఏలు ఆందోళ‌న విర‌మించాల‌ని కేటీఆర్ కోరారు. మంత్రి ప్ర‌తిపాద‌న‌పై స్పందించిన వీఆర్ఏలు త‌మ సంఘం నేత‌ల‌తో చ‌ర్చించి త‌మ నిర్ణ‌యాన్ని చెబుతామ‌ని తెలిపారు.

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు 50రోజులకి పైగా ఆందోళన చేస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరవధిక సమ్మెకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. పేస్కేల్‌ను అమలు చేయాలి.. అర్హత కలిగిన వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇవ్వాలి, 55 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వా లని వారు డిమాండ్‌ చేస్తున్నారు.