ఔను.. బీజేపీ మాజీ సర్పంచ్‌కి కాల్ చేశా..: మంత్రి కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఔను.. బీజేపీ మాజీ సర్పంచ్‌కి కాల్ చేశా..: మంత్రి కేటీఆర్

October 21, 2022

Minister KTR clarified that he was the one who called and spoke to BJP leader Jagannath.
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ టెలిఫోన్ సంభాషణ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే సంభాషించారు. మునుగోడు లో టీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని , ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి పోయేది లేదు, బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదుని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి బిజెపి మనిషి కాదని, అవకాశవాద రాజకీయం కోసం బీజేపీలో చేరారన్నది ఆ సంభాషణ సారాంశం. దీనిపై బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రలోభ పెట్టేందుకే తమ నేతలకు ఫోన్ చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతలకు ఫోన్లు చేసి కేటీఆర్ ప్రలోభపెట్టారంటూ విమర్శలు ఇస్తున్నారు.

దీనిపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత జగన్నాథానికి కాల్‌ చేసి మాట్లాడింది తానేనని స్పష్టం చేశారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆ బీజేపీ నేత సహ.. మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులని, కార్యకర్తలని ఓటు అడిగే హక్కు తమకుందని అన్నారు. వారందరికీ రైతుబంధు, రైతు భీమా సహ మిగిలిన ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తున్నాయని.. పనిచేశాం కాబట్టి ఫోన్ చేసి ఓటు అడగడంలో తప్పేముందని అన్నారు. ఒకవేళ ఆ నియోజక వర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి ఓటు ఉంటే లెక్క ప్రకారం అయితే తమకే ఓటు వేయాల్సిఉందన్నారు. కాల్ చేసి అడిగినందుకు జగన్నాథం సానుకూలంగానే స్పందించారని.. మిగతా వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

ఇదే విషయమై గట్టుప్పల్ మాజీ సర్పంచ్ జగన్నాథం మాట్లాడుతూ… మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు సహకరించాలని కోరారని, కొత్తగా మండలం ఇచ్చామని, దాని అభివృద్ది కోసం నిధులతోపాటు అన్ని రకాలుగా సమకూరుస్తామని చెప్పారన్నారు. చేనేత కార్మికులకు మంచి పథకాలు వస్తున్నాయని, ఇంకా ఏమేమి కావాలో చెబితే అమలు చేస్తామని అన్నారన్నారు.