తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని కొన్నిరోజులుగా జోరు ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలు మాదిరిగానే ఈ సారి కూడా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోతారని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల 17న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం తరువాత కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అనంతరం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడంతో త్వరలో అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనలతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.
శనివారం నిజామాబాద్‌లో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ బీజేపీ సర్కార్ పై మండిపడ్డారు. ” పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వస్తే తాము కూడా ఎన్నికలకు సిద్ధం. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. పునర్విభజన చట్టంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఒక్కపైసా అదనంగా తెలంగాణకు ఇవ్వలేదు. నేను చెప్పింది తప్పైతే రాజీనామాకు సిద్దం. బీజేపీ నేతలు నా సవాల్‌ను స్వీకరిస్తారా?’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి :
సీబీఐకి వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ..విచారణకు హాజరవుతున్నట్టు వెల్లడి