జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం ఘటనలో మైనర్లు ఉండడంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాం చేసేంత స్థాయికి చేరారంటే ఇంకా మైనర్లేంటి? మేజర్లకు పడే శిక్షనే వారికి పడేలా చూడాలి. ఈ విషయంలో పోలీసులకు చేసింది కరెక్టే అని నేను నమ్ముతున్నాను’ అని వ్యాఖ్యానించారు. కాగా, నిందితుల్లో ఒకరు మేజర్ కాగా, నలుగురు మైనర్లు. ఇంతకు ముందే పోలీసులు మైనర్లయిన నిందితులను చార్జిషీట్ దాఖలు చేసే సమయానికి మేజర్లుగా పరిగణించాలని జువైనల్ కోర్టును కోరిన విషయం తెలిసిందే. కోర్టు ఒకే అంటే మైనర్ నిందితులు మేజర్లయిన తర్వాత పెద్ద వారికి పడే శిక్షే వారికి పడుతుంది.