బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా - MicTv.in - Telugu News
mictv telugu

బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

May 13, 2022

తెలంగాణ బీజీపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. న్యాయవాదితో బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు పంపారు. ఈనెల 11న ట్విటర్‌లో కేటీఆర్‌పై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులల్లో పేర్కొన్నారు. ఆరోపణలపై ఆధారాలుంటే బయటపెట్టాలని, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు 48 గంటల్లో కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ తరపు న్యాయవాది నోటీసులు జారీ చేశారు.

మంత్రి కేటీఆర్ గారి పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని లాయర్ నోటీసులో పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారన్నారు.