ఆదుకున్న కేటీఆర్.. వరంగల్ యువతికి లక్షన్నర - MicTv.in - Telugu News
mictv telugu

ఆదుకున్న కేటీఆర్.. వరంగల్ యువతికి లక్షన్నర

August 10, 2020

Minister ktr financial aid to warangal iit student .

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఎంత ఆక్టివ్ గా ఉంటారో తెలిసిందే. సహాయం కోరుతూ ఎవరైనా ట్వీట్ చేస్తే వెంటనే స్పందిస్తారు. ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉన్నా.. ఆర్థిక సమస్యలున్నా వెంటనే తీర్చుతారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా హాసన్ పర్తికి చెందిన మేకల అంజలి అనే విద్యార్థిని గతేడాది గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఐఐటీలో ర్యాంకు సాధించింది. ఆమెకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్న ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. కానీ, ఆమె కుటుంబ పరిస్థితి కారణంగా వెళ్లలేకపోతుంది. ఇదే విషయాన్ని అప్పట్లో మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేసింది. 

వెంటనే స్పందించిన కేటీఆర్ ఆమెను ఇంటికి పిలిపించుకుని ఆర్థిక సహాయం చేశారు. అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ కావడంతో పూర్తి ఐఐటి విద్య కోసం అవసరమైన నిధులను వ్యక్తిగతంగా అందజేస్తానని మంత్రి గత ఏడాది హామీ ఇచ్చారు. దీంతో ఆమె ఇండోర్ వెళ్లి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. తాజాగా రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు, ఇతర ఖర్చుల నిమిత్తం కేటీఆర్ మరో లక్ష 50 వేల రూపాయలను అందించారు. ఈరోజు ప్రగతిభవన్ లో అంజలికి మంత్రి కేటీఆర్ చెక్ ను అందజేశారు. దీంతో అంజలి కుటుంబం మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది.