Minister KTR Fires on Modi sarkar Over sale of Pawan Hans
mictv telugu

3700 కోట్ల కంపెనీని ‘ల‌క్ష కంపెనీ’కి ఎట్లమ్మిన‌వ్? మోదీపై కేటీఆర్ ఫైర్

May 3, 2022

ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీక‌ర‌ణ చేస్తోంది మోదీ స‌ర్కార్. తాజాగా లాభాల్లో ఉన్న మ‌రో ప్రభుత్వ రంగ సంస్థ ‘పవన్ హన్స్‌’ను అమ్మడంపై తెలంగాణ పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న కంపెనీని ప్రైవేట్ కంపెనీకి అమ్మడమే ఓ ఘోరమైతే, దానిని ఆరు నెలల క్రితం కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో పెట్టిన కంపెనీకి కట్టబెట్టడం చూస్తే అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు.

2017 లోనే పవన్ హన్స్ కంపెనీ విలువ రూ.3700 కోట్లు ఉండేదని, అలాంటి కంపెనీని లక్ష రూపాయల కంపెనీకి ఎలా అమ్మారని ట్వ‌ట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు కేటీఆర్. ఐదేళ్ల క్రితమే 3700 కోట్ల విలువైన కంపెనీలో 49 శాతం వాటాను రూ.211 కోట్లకు అమ్మడం ఎలా సాధ్యమంటూ మండిప‌డ్డారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు మీ దగ్గర సమాధానం ఉందా అంటూ నిల‌దీశారు. ఆయ‌న‌ చేసిన ట్వీట్‌లో పవన్ హన్స్ సంస్థ అమ్మకానికి సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన క‌థ‌నాల‌కు కూడా షేర్ చేశారు. హెలికాప్టర్లను అద్దెకిచ్చే పవన్ హాన్స్ కంపెనీలో భారత ప్రభుత్వం, ఓఎన్జీసీ కలిసి 51:49 నిష్పత్తిలో భాగస్వామ్యాన్ని కలిగివున్నాయి.