తెలంగాణ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు సంపాదించారు. టాప్ 30లో కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా 12, మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతా 22వ స్థానంలో నిలిచాయి. భారత దేశం నుంచి కేవలం ఇద్దరు మాత్రమే జాబితాలో చోటు దక్కించుకోగా, మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. ఈయన లిస్టులో 23వ స్థానంలో నిలిచారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఈ జాబితాను వెల్లడించారు. ఈ జాబితా ప్రకారం అగ్రస్థానంలో పర్యావరణ సామాజిక కార్యకర్త గ్రెటా థన్ బెర్గ్ ఉండగా, రెండో స్థానంలో యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ వెనెస్సా నకేట్, మూడో స్థానంలో హెలెనా గువాలింగ వంటి ప్రముఖులు ఉన్నారు.