Minister KTR has ordered an inquiry into the Rs 1,000 crore land scam in Sangareddy district
mictv telugu

వెయ్యి కోట్ల స్కాం బయటపెట్టిన సర్పంచ్.. కేటీఆర్ కీలక ఆదేశాలు

January 9, 2023

Minister KTR has ordered an inquiry into the Rs 1,000 crore land scam in Sangareddy district

సంగారెడ్డి జిల్లాలో వెయ్యికోట్ల భూకుంభకోణం వెలుగు చూసింది. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని 261 సర్వేనెంబరులోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని గ్రామ సర్పంచ్ ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం బయటికి వచ్చింది. సర్పంచ్ ఫిర్యాదుపై స్పందించిన మంత్రి కేటీఆర్.. వెంటనే విచారణ ప్రారంభించాలని అధికారులను అదేశించారు. దీంతో జిల్లా అధికారులు గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. సోమవారం నిర్వహించే సర్వేకు సహకరించాలని, అనంతరం 118 మంది రైతులకు ఆన్ లైన్లో పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ ఫిర్యాదు ప్రకారం.. వెయ్యి కోట్లు విలువ చేసే 588 ఎకరాల స్థలంలో ప్రభుత్వం, రైతులు, రిటైర్ట్ ఆర్మీ అధికారులు, పేదలకు చెందిన భూములు, ప్లాట్లు ఉన్నాయి. దీన్ని రియల్టర్లు, పెట్టుబడిదారులో కలిసి రెవెన్యూ అధికారులు కుమ్మక్కై కాజేసే ప్రయత్నం చేశారు. దీన్ని సర్పంచ్ పసిగట్టి లోకాయుక్తకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎలాగైనా కాంప్రమైజ్ కావాలని పెద్దలతో హుకుం జారీ చేయించినా సర్పంచ్ లొంగక రైతుల పక్షాన నిలిచారు. చంపేస్తామని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ వివరాలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఫిర్యాదు చేశాడు. అలాగే తనకు ప్రాణహాని ఉందని, తన కుటుంబానికి రక్షణ కల్పించి రియల్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి అధికారులను అదేశించగా, రోజుల వ్యవధిలో సర్వే చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.