డ్రగ్స్ వాడతారంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదేపదే చేస్తున్న ఆరోపణలు కీలక మలుపు తిరిగాయి. మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించి డ్రగ్ టెస్టుకు సిద్దమని ప్రకటించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు.
‘ప్రజా సమస్యలపై చర్చించకుండా ఈ చిల్లర రాజకీయాలేందీ? ఏమొస్తది దీని వల్ల? డ్రగ్ టెస్టుకు నేను రెడీ. నా బొచ్చు, గోర్లు, రక్తం, కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా. క్లీన్ చిట్ తో బయటకి వస్తా. తర్వాత కరీంనగర్ కమాన్ వద్ద తప్పైపోయిందని నీ చెప్పుతో నువ్వు కొట్టుకుంటావా? దీనికి రెడీ అంటే చెప్పు. నేను ఇక్కడే ఉంటా. ఏ డాక్టర్ ని తీసుకువస్తాడో, ఏ గుండు కొట్టే మనిషిని తెస్తాడో తెమ్మనండి. వాని బొంద. ఏం కావాలో అన్నీ ఇస్తా. ఏం రాజకీయమయ్యా ఇది. వానికేమైనా తెలివి ఉందా అసలు… మనిషా? పశువా? కరీంనగర్ కి ఏం చేశావో చెప్పే దమ్ము లేదు. హౌలా మాటలు తప్ప ఇంకేముండదు. ఏం తెచ్చినవు నువ్వు కేంద్రం నుంచి. వేములవాడ రాజన్నకు, కొమురవెల్లి మల్లన్న దేవాలయాలకు మోదీకి చెప్పి ఏమైనా తెచ్చినవా? ఆయనను అడగాలంటే భయమా? లేక పలుకుబడి లేదా? మళ్లీ మాట్లాడితే హిందూ అంటరు’ అంటూ నిప్పులు చెరిగారు. కాగా, కేటీఆర్ తో పాటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ వాడతారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
మల్లారెడ్డికి పొగపెడుతున్నారా? అతిచేష్టలే ముంచబోతున్నాయా?
రైతుల కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే…కారణమేమిటంటే ?
సిరిసిల్ల షాలిని కిడ్నాప్ స్టోరీ.. సినిమాను తలపించే ట్విస్టులతో పూర్తి కథనం