minister Ktr responds on 4 years old boy died by street dogs express condolences
mictv telugu

కుక్క‌ల దాడిలో బాలుడి మృతి.. మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..

February 21, 2023

minister Ktr responds on 4 years old boy died by street dogs express condolences

వీధికుక్కలు దాడి చేయడంతో హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై నగరవాసులు సిటీలో వీధికుక్కల సంచారం ఎక్కువై, ప్రజల భద్రతకు సమస్యగా మారిందని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కూడా ఈ వార్తపై స్పందించారు. కుక్కల దాడిలో బాలుడు చనిపోవటం విషాదకరమని.. ఈ ఘటన చాలా బాధకలిగించిందని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా స్టెరిలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఎక్కడికక్కడ యానిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. బాలుడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపిన కేటీఆర్.. ఆ ఫ్యామిలీని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. చనిపోయిన చిన్నారిని ఎలాగూ తీసుకురాలేమని.. కానీ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.

కాగా ఈ నెల ఫిబ్రవరి 19 న ఆదివారం నాడు తండ్రి పనిచేస్తున్న కారు సర్వీస్‌ సెంబర్‌ వద్దకు వెళ్లిన చిన్నారిని వీధి కుక్కలు వెంటాడాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి చిన్నారిని వదలకుండా తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు.