Minister KTR satires on Amit Shah Telangana tour with his tweets
mictv telugu

అమిత్‌షా మనకు హితబోధ చేయడానికి వచ్చారు.. మంత్రి కేటీఆర్ సెటైర్లు

August 22, 2022

రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిన్న సెటైర్లు వేశారు. కుటుంబపాలనపై అమిత్‌షా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ట్వీట్‌ చేశారు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ర్యాంకులను సాధించి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన… ఓ కుమారుడి తండ్రి రాష్ట్రంలో పర్యటించనున్నారని విమర్శించారు.

ఇక ఆ తండ్రి.. సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన అన్న ఎంపీగా పదవిలో కొనసాగుతుండగా… భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తి తరపున ప్రచారం చేయడానికి వచ్చారన్నారు. కుటుంబ పాలన రద్దు చేయాల్సిన అవసరంపై ఆ తండ్రి మనకి హితబోధ చేస్తారంటూ కేటీఆర్ ట్వీట్‌ చేశారు.