Minister KTR Satirical Comments PM Modi Govt Over Medical Colleges
mictv telugu

అందరూ ఒకే అబద్ధం చెప్పేలా శిక్షణ ఇవ్వండి – కేటీఆర్

February 17, 2023

minister ktr satirical comments pm modi govt over medical colleges

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై సెటైర్లు వేశారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్రమంత్రులు తలా ఒక మాట చెప్తుండడంతో చురకలంటించారు. ఇంతకుముందు మెడికల్ కాలేజీలు కేటాయించకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని, దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మంజూరు చేసి తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా వివక్ష చూపారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. దీనిక గురువారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలకు మళ్లీ మెడికల్ కాలేజీలు ఇవ్వమని ప్రతిపాదనలు పంపారని, కేసీఆర్‌కు మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదని ఎద్దేవా చేశారు. దీంతో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ విషయంలో గతంలో ముగ్గురు కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చారు. ‘కిషన్ రెడ్డి 9 కాలేజీలు మంజూరు చేశామని, మన్‌సుఖ్ మాండవీయ అసలు ప్రతిపాదనలే రాలేదని, నిర్మలా సీతారామన్ ఏమో రెండు ప్రతిపాదనలు వచ్చాయని చెప్తున్నారు. ఎలాగూ అబద్ధమే చెప్తున్నారు కాబట్టి కనీసం అందరూ ఒకే అబద్ధం చెప్పేలా ప్రధాని మోదీ వారికి సరైన శిక్షణ ఇవ్వాల్సింది’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. కాగా, తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిధుల పరంగా కేంద్ర సహకారం లేకున్నా కేవలం రాష్ట్ర నిధులతోనే వీటిని నిర్మించి వేల విద్యార్ధులకు వైద్యవిద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు.