Minister ktr Strong counter to union minister kishan reddy tweet goes viral
mictv telugu

చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు అది అర్థం కాదు.. మంత్రి కేటీఆర్

March 12, 2023

Minister ktr Strong counter to union minister kishan reddy tweet goes viral

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కౌంటర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కిషన్ రెడ్డి ట్వీట్ చేయగా.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై మంత్రి కేటీఆర్ అదే విధంగా కౌంటర్ ఇచ్చారు. అసలు విషయానికొస్తే.. మిలియన్ మార్చ్ గుర్తు చేస్తూ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. మిలియన్ మార్చ్ కు సుభిక్ష కాలం గడిచిందని, కేసీఆర్ నియంతృత్వ పాలనలో కనీస గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో పాటు మిలియన్ మార్చ్ కు బాధ్యులైన నాయకులు, ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు, విమోచన దినోత్సవానికి సరైన గుర్తింపు లభించలేదన్నారు. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆశయాలను నీరుగార్చేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ట్వీట్ చేశారు.

కిషన్ రెడ్డి ట్వీట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం? తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు. మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పనులు చెయ్యండి’ అంటూ కిషన్ రెడ్డి ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు.