తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాలికి గాయమైంది. ఆయన శనివారం పట్టుతప్పి కిందపడ్డారు. ఓ కార్యక్రమంలో ఆయన కిందపడిపోయానని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన కాలు చీలమండకు దెబ్బ తగిలిందంటూ కాలికి బ్యాండేజీ వేసుకుని ఫోటోను షేర్ చేశారు. ‘డాక్టర్లు 3 వారాల పాటు విశ్రాంతి అవసరమన్నారు. కాలక్షేపం కోసం ఓటీటీలో ఏవైనా మంచి కార్యక్రమాలు ఉంటే చెప్పండి’ అని కోరారు.
Had a fall today & ended up tearing my ankle ligament. Been advised 3 weeks of rest 🙁
Any advise on binge worthy OTT shows? pic.twitter.com/sWat7eCkWX
— KTR (@KTRTRS) July 23, 2022