గల్ఫ్ జైలులో ఉన్న అన్నలూ.. బెంగపడొద్దు నేనొస్తున్నా.. కేటీఆర్ ! - MicTv.in - Telugu News
mictv telugu

గల్ఫ్ జైలులో ఉన్న అన్నలూ.. బెంగపడొద్దు నేనొస్తున్నా.. కేటీఆర్ !

September 26, 2018

ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లలు, స్నేహితులను వదిలి నాలుగు పైసలు పోగు చేసుకుందామని అప్పులు చేసి చాలామంది దుబాయ్ వెళ్లారు. పోయినవాళ్ళకు పనులు దొరక్క, కంపెనీ వీసాలని బ్రోకర్ ఇక్కడినుంచి పంపించాక అక్కడ పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ? అక్కడి నుంచి ఎక్కడికి పోలేక, అక్కడ ఉండలేకా నానా ఇబ్బందులు పడుతూ అఖరికి జైలులో జీవితం గడుపుతున్నారు. ఎవరైనా వచ్చి, తమను బయటకు తీసుకెళ్తారేమోనని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారందరికీ నేనున్నాను అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ బయలు దేరనున్నారు.Minister Ktr Went To Dubai For Releasing Our Telangana People From Dubai Jail ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి గల్ఫ్ జైలులో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న తెలంగాణ వాసుల్ని మన దేశానికి రప్పించేందుకు మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లనున్నారు. దేశం నుంచి దుబాయ్ వెళ్లి వీసా కాలపరిమితి ముగిసిపోయి, జైళ్లలోనే ఉంటున్న వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దుబాయ్ ప్రభుత్వం తమ దేశంలో జైలు జీవితం గడుపుతున్న వారిని విడుదల చేయాలని నిర్ణయ తీసుకుంది.

దీంతో వారిని మనదేశానికి రప్పించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందుకోసం సంబంధిత అధికారులతో కలిసి మంత్రి కేటీఆరే స్వయంగా దుబాయ్‌కి వెళ్లనున్నారు. అక్కడి అధికారులతో చర్చలు జరిపి తెలంగాణ వాసులను తీసుకొచ్చేందుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారు. వారు తిరిగి రావడానికి టికెట్లు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.