Minister KTR Who Give original meaning of PM Modi double engine
mictv telugu

KTR : మోదానీ.. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదే..

March 9, 2023

బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలను రాజకీయంగానే ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీజేపీ నేతలపై నమోదు చేసిన కేసులను ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు చూపించగలవా? అని ఆయన సవాల్‌ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, బీజేపీ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

9 ఏండ్ల పాల‌న‌లో 9 రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చిన మాట వాస్త‌వం కాదా..? పెద్ద‌ ఎత్తున పార్టీల‌ను చీల్చిన మాట నిజం కాదా..? అని ప్రశ్నించారు కేటీఆర్. డ‌బుల్ ఇంజిన్ అంటే దేశానికి అర్థ‌మైందని.. ఒక ఇంజిన్ మోదీ, ఇంకో ఇంజిన్ అదానీ అని అన్నారు. అడ్డ‌మైన దొంగ సొమ్ముతో ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ్డ పార్టీల‌ను చీల్చి, లొంగ‌ని వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేయించాలని.. అదేప‌నిగా పెట్టుకున్నారన్నారు. మునుగోడులో ఒక వ్య‌క్తికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్త‌వం కాదా..? దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు జ‌వాబు చెప్పే ద‌మ్ము బీజేపీ నాయ‌కుడికి ఉందా..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనబోయిన దొరికిపోయిన బీఎల్ సంతోష్ మాదిరిగా మేము స్టే తచ్చుకోబోమని, జడ్జీలలో కొంత మంది బీజేపీ వాళ్లు ఉండొచ్చు కానీ కొందరు మంచి జడ్జీలు ఉన్నారన్నారు. న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని చెప్పారు. విదేశాల్లో బొగ్గును ఎందుకు కొనాలి.. అని సీఎం కేసీఆర్, యూపీ సీఎం కేంద్రాన్ని అడిగితే ఇంత వ‌ర‌కు స్పంద‌న లేదని అన్నారు.