Minister KTR's reply to Manchu Vishnu's tweet on Yadagiri Gutta
mictv telugu

యాదగిరి గుట్టపై మంచు విష్ణు ట్వీట్.. మంత్రి కేటీఆర్ రిప్లై

October 20, 2022

తన కొత్త సినిమా జిన్నా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు హీరో మంచు విష్ణు. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణం అద్భుతమని కొనియాడుతూ ట్వీట్ చేశారు. చాలాకాలం తర్వాత యాదాద్రిని సందర్శించానని, కేసీఆర్, కేటీఆర్‌లు ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ సూపర్‌గా ఉందన్నాడు. మన ఆలయాలు అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని, జై శ్రీ రామ్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. మీకు నచ్చినందుకు సంతోషం అని బదులిచ్చారు.

 

ఈ నెల 21న తన మూవీ జిన్నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంలో బుధవారం.. రచయిత కోన వెంకట్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు మంచు విష్ణు. ప్రత్యేక పూజలు చేసి సినిమా సక్సెస్‌ కావాలని మొక్కుకున్నారు. జిన్నా సక్సెస్‌ అయితే కుటుంబ సమేతంగా వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు. చాలా రోజులుగా మంచి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 21న ప్రేక్షకుల ముందు కు రాబోయే జిన్నా సినిమా మంచి ప్రేక్షకాదరణ పొంది గొప్ప విజయాన్ని సాధించడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.