Minister Malla Reddy sensational comments on IT officials
mictv telugu

నా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.. మంత్రి మల్లారెడ్డి

November 23, 2022

మంగళవారం ఉదయం నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లడు రాజశేఖర్‌ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా.. మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి అస్వస్థత గురయ్యారు. దీంతో ఆయను సూరారంలోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లారు మల్లారెడ్డి. ఈ క్రమంలో ఐటీ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘ఐటీ అధికారులు నా కొడుకును కొట్టినట్టున్నారు. నా పెద్ద కొడుకు మహేందర్ రెడ్డి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆస్పత్రిలో నా కొడుకును చూడనివ్వడం లేదు. మహేందర్ రెడ్డి ని ఐటీ అధికారులు రాత్రంతా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నారు. మేము ఎవరిని దగా మోసం చేయడం లేదు. మేం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నాం. స్మగ్లింగో, క్యాసినోనో ఆడటం లేదు. బీజేపీ దుర్మార్గ పాలన చేస్తోంది’’ అంటూ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కావాలని తనపై ఐటీ దాడులు చేస్తున్నారని, 200 మంది ఐటీ అధికారులతో మాపై దాడులు చేయించి భయపెడతారా? అని ఆయన మండిపడ్డారు. అయితే.. అయితే.. సూరారం హాస్పిటల్‌కి మల్లారెడ్డితో పాటు ఐటీ అధికారులు వెళ్లారు.