Minister Mallareddy protested in front of Narayana Hospital in suraram
mictv telugu

అతని కోసం అడిగితే ఆస్తి రాసిస్తా : మంత్రి మల్లారెడ్డి

November 23, 2022

Minister Mallareddy protested in front of Narayana Hospital in suraram

తన ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేస్తున్న ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఫైరయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తన కుమారుడిని కనీసం చూడడానికి కూడా అనుమతించడం లేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారుడు మహేందర్ రెడ్డి సూరారంలోని నారాయణ ఆస్పత్రిలో గుండె, ఎడమ భుజం నొప్పితో ఆసుపత్రిలో చేరగా, మల్లారెడ్డి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు అనుచరులు కూడా తోడవగా, విషయం తెలిసి టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటుండంతో ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. తన కొడుకు భయంతో వణికిపోతున్నాడని, ఐటీ అధికారులు ఏమైనా చేస్తారేమోననే భయం వేస్తుందని అన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తన కొడుకును కొట్టారని, రాత్రంతా వేధించారని ఆరోపించారు. అడిగితే తమ ఆస్తి రాసిస్తామని, కావాలనే తమ కుటుంబంపై దాడులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక బీజేపీ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని, సోదాల్లో ఎలాంటి డబ్బు పట్టుకోలేదని స్పష్టం చేశారు. అటు వైద్యులు మహేందర్ రెడ్డి ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, గతంలోనూ చెస్ట్ పెయిన్, ఎడమ భుజం నొప్పి వచ్చిందని తెలిపారు. కాగా, ఐటీ అధికారులు కూడా మహేందర్ రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు.