సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించిన మంత్రి..  - MicTv.in - Telugu News
mictv telugu

సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించిన మంత్రి.. 

October 9, 2019

Minister Perni nani.

స్థాయి ఎంత పెద్దది అయినా తాము ప్రజలకోసం పనిచేసే నేతలం అని కొందరు నాయకులు ఎప్పుడూ మరిచిపోరు. ఈయన మా నేతే అని ప్రజల్లో విశ్వాసం పొందాలంటే సామాన్య ప్రజలతో మమేకం అవాలి. అప్పుడే వారి సమస్యలు తెలుస్తాయి. ఈ విషయంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ముందు వుంటారని చెప్పవచ్చు. ఓ సామాన్య వ్యక్తిలా ఆటోలో ప్రయాణం చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని పలు కార్యక్రమాలకు ఆయన ఆటోలో వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

మంత్రి అంటే ఎంత కట్టుదిట్టమైన భద్రత వుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భద్రత నడుమే వారు కారులో తిరిగుతారు. కానీ, పేర్నినాని అవన్నీ వద్దనుకుని తాను మంత్రిననే విషయాన్ని కూడా మరిచిపోయి ఇలా ఆటోలో ప్రయాణించడంతో స్థానిక ప్రజలు ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాన్య వ్యక్తిలా ప్రజలతో కలిసి ప్రయాణిస్తేనే వారి సమస్యలు తెలుస్తాయని మంత్రి పేర్ని నాని అన్నారు.