టీడీఎల్పీ ఆఫీసులో పేర్ని నాని.. పిలిచి మాట్లాడిన జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

టీడీఎల్పీ ఆఫీసులో పేర్ని నాని.. పిలిచి మాట్లాడిన జగన్

March 31, 2022

nani

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మంత్రి పేర్నినాని టీడీఎల్పీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి సిబ్బందితో చాలా చనువుగా మాట్లాడారు. వారిచ్చిన స్నాక్స్ తింటూ, వారితో ముచ్చటించారు. టీ తాగుతూ.. టీడీపీ నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. అయితే పేర్ని నాని ఇలా ఉండడం సాధారణమేనని చాలా మంది చెప్తారు. అందరితో కలుపుగోలుగా ఉంటాడని ఆయనకు పేరుంది. మీడియా మిత్రులతోనూ ఫ్రీగా ఉంటారు. టీడీపీ అనే కాకుండా ఇతర పార్టీల సభ్యులతో కూడా ఆయన ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే టీడీఎల్పీ ఆఫీసుకు వెళ్లడం నచ్చని కొందరు వైసీపీ నేతలు విషయాన్ని సీఎం జగన్ చెవిలో వేశారు. దీంతో ఇటీవల నాని ఎదురుపడినప్పడు సీఎం జగన్ ఈ విషయాన్ని అడిగారు. జవాబుగా.. నేను అందరితో కలుపుగోలుగా ఉంటానని, అయినా పార్టీ గీత దాటనని చెప్పారు. దీనికి జగన్ నవ్వుతూ.. కొంచెం ముందూ వెనకా చూసుకోమని సలహా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.