కొబ్బరి చెట్టు ఎక్కి మంత్రి మీడియా సమావేశం.. నిరసన మాత్రం కాదు - MicTv.in - Telugu News
mictv telugu

కొబ్బరి చెట్టు ఎక్కి మంత్రి మీడియా సమావేశం.. నిరసన మాత్రం కాదు

September 19, 2020

Minister

చెట్ల కింద మీడియా సమావేశాలు నిర్వహించడం సర్వ సాధారణం. కానీ ఓ మంత్రి మాత్రం వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు. మీడియా ప్రతినిధులు రాగానే ఆయన నేరుగా కొబ్బరి చెట్టెక్కి వారితో ముచ్చటించారు. శ్రీలంకలోని వాయువ్య ప్రావిన్స్‌లో మంత్రి అరుండికా ఫెర్నాండో ఈ విచిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. కొబ్బరి బొండాలు కోస్తూ.. అనేక అంశాలను వివరిస్తూ కనిపించారు. ఇది చూసి అంతా అవాక్కయ్యారు. అయితే దీని వెనక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. 

ఫెర్నాండో కొబ్బరి, పిష్‌టైల్ పామ్, రబ్బర్ ఉత్పత్తుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో వాటిపై ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. డాంకోటువాలోని తన కొబ్బరి ఎస్టేట్‌లోకి మీడియా ప్రతినిధులను పిలిపించారు. కొబ్బరి సంబంధింత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో.. కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని అన్నారు. ఈ సందర్భంగా కొబ్బరి కాయలు కోసే కూలీల పరిస్థితిపై మాట్లాడారు. ఒక్కొ చెట్టుకు 100 రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ విషయం అర్థం కావాలనే తాను ఇలా చెట్టెక్కి మాట్లాడుతున్నానని తెలిపారు.  ఈ సందర్భంగా సులువుగా కొబ్బరిచెట్లు ఎక్కే యంత్రాన్ని కూడా మంత్రి పరీక్షించారు.