యుద్ధ విమానమెక్కిన రాజ్‌నాథ్.. రక్షణశాఖలో సరికొత్త రికార్డ్  - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధ విమానమెక్కిన రాజ్‌నాథ్.. రక్షణశాఖలో సరికొత్త రికార్డ్ 

September 19, 2019

భారత రక్షణశాఖ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. తేజస్ యుద్ధ విమానంలో తొలిసారి రక్షణ మంత్రి ప్రయాణించారు .బెంగుళూర్‌లోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ విమానంలో ఆయన ప్రయాణించారు. జీ సూట్ ధరించి ఆయన గగన విహరం చేశారు. విమానం పనితీరును ఆయన తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఏ రక్షణ మంత్రి కూడా యుద్ధవిమానంలో ప్రయాణించలేదు. తొలిసారి రాజ్‌నాథ్ ప్రయాణించి చరిత్ర సృష్టించారు. 

ఈ తేలికపాటి తేజస్ యుద్ద విమానాన్ని భారత్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసింది. మొత్తం 83 యుద్ధ విమానాలు తయారు చేసేందుకు హెచ్ఏఎల్‌కు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.రూ. 50 వేల కోట్లతో వీటిని తయారు చేసేందుకు ఒప్పందం జరిగింది. వీటిలో మొదటి విడతలో 40 తేజస్ యుద్ధవిమానాలను తయారు చేస్తున్నారు. వీటిలో భాగంగా తొలి తేజస్ యుద్ధ విమానంలో రక్షణ మంత్రి ప్రయాణించారు. 

గత శుక్రవారం, తేజస్ విమానాన్ని పరీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ విమానంగా అవతరించింది. ఈ ఫైటర్ జెట్ విమానాలను నావికాదళ సేవల కోసం వినియోగించనున్నారు. నేవీలో సంస్కరణలో భాగంగా వీటిని ప్రవేశపెట్టబోతున్నారు.