ఇప్పటంలో పవన్ కల్యాణ్ ని తెలివిగా ఇరికించారు - MicTv.in - Telugu News
mictv telugu

ఇప్పటంలో పవన్ కల్యాణ్ ని తెలివిగా ఇరికించారు

November 24, 2022

ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకున్నట్టు పవన్ కల్యాణ్ ని కూడా చంద్రబాబు వాడుకుంటున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. ఇప్పటికే విశాఖ ఘటనలో వాడుకున్న చంద్రబాబు.. ఇప్పటంలో పవన్ కల్యాణ్ ని తెలివిగా ఇరికించాడని ఆరోపించారు. ఇప్పటం ఉన్నది లోకేష్ పోటీ చేసే మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి వెళ్లి పవన్ ఇరుక్కుపోయాడని, రాష్ట్ర సమస్యలు, రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని పవన్ చంద్రబాబు ఉచ్చులో పడకుండా వాస్తవాలను గ్రహించాలని సూచించారు.

హైకోర్టుకు తప్పుడు సమాచారం అందించినందుకు రూ. లక్ష చొప్పున హైకోర్టు జరిమానా విధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇంతకంటే పవన్ కల్యాణ్ కి పెద్ద దెబ్బ ఇంకేముంటుంది? అని ఎద్దేవా చేశారు. దిగజారుడు రాజకీయాలతో జగన్ పై విషం చిమ్మి పవన్, చంద్రబాబులు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.