వీరసింహారెడ్డి సక్సెస్ ఈవెంట్ సందర్భంగా అక్కినేని కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న అక్కినేని అభిమానులకి అండగా.. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవ్వరు స్పందించలేదు. బాలయ్యకి బయపడో లేక ఇంకేదైనా కారణమో కానీ నాగార్జునకి మద్దత్తుగా ఎవరు నిలబడలేదు. కంపు మనకెందుకు అనుకున్నాడో ఏంటో కానీ ఇంతవరకు అక్కినేని కుటుంబానికి పెద్ద దిక్కు నాగార్జున సైతం బాలయ్యకి కౌంటర్ చేసే సాహసం చేయలేదు. అయితే అక్కినేని బ్రదర్స్ మాత్రం బాలయ్యకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 60ఏళ్ళు దాటినోడు పిల్లలతో చెప్పించుకునే స్థాయికి పడిపోయాడేంటీ అని చాలామంది ఫీల్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బాలయ్య అక్కినేని వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. జగన్ కి అనుకూలంగా ఉంటాడని నాగార్జున అంటే బాలయ్యకి పడదనేది ఇండస్ట్రీలో అందరికి తెలిసిన అంశమే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుండి మంత్రి రోజా నాగార్జునకి సపోర్టుగా.. బాలయ్యకి కౌంటర్ ఇచ్చింది.
తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. అక్కినేనిపై అగౌరవంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నా బాలకృష్ణ బుద్ధి, ప్రవర్తన ఏ మాత్రం మెరుగుపడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులను తీవ్రంగా బాధించాయని మంత్రి రోజా పేర్కొన్నారు. వెంటనే ఈ వివాదంపై నాగార్జున స్పందించాలని డిమాండ్ చేశారు. మీడియాతో రోజా మాట్లాడుతూ.. బాలకృష్ణ అక్కినేనిని అవమానించడం తప్పన్నారు. ఎన్టీఆర్‌ని అవమానిస్తే వీళ్ళు ఎంత బాధ పడతారో, అదే విధంగా అక్కినేని అభిమానులు కూడా బాధపడతారన్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకూ బాలకృష్ణ తప్పును సరిదిద్దుకోలేదన్నారు. ఆయన ఎప్పుడు సరిదిద్దుకోడన్నారు. బాలయ్యకు వయసు పెరిగినా..మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. బాలయ్య వ్యాఖ్యలపైన నాగార్జున సమాధానం చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేసారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయినా బాలయ్య తీరులో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కినేని అభిమానుల ఆందోళనలో అర్దం ఉందని రోజా చెప్పుకొచ్చారు.