ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా నారా లోకేష్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తనను జబర్దస్త్ ఆంటీ అని పిలిచావు సరే. మీ అమ్మను హెరిటేజ్ ఆంటీ, మీ భార్యను హెరిటేజ్ పాప అనాలా? అని విరుచుకుపడ్డారు. పాదయాత్రకు జనం లేక పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారని టెంట్లలో పడుకొని సాయంత్రం వాకింగ్ చేసే లోకేశ్‌కి జగన్‌ని ఎదుర్కొనే దమ్ముందా? అని ప్రశ్నించారు. ‘జగన్ పులి అయితే లోకేశ్ పులకేశి. నిజంగా జగన్ ముందుకు వస్తే గుండె ఆగి చస్తాడు. మీ నాన్న చంద్రబాబు పొలంలో ఎర్ర దుంగలు ఎలా వచ్చాయో ఇప్పటికీ తేలలేదు. జగన్‌కి సొంత నియోజకవర్గం పులివెందులలో ఇల్లు, విజయవాడలో మరో ఇల్లు ఉంది.
లోకేశ్, చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్రంలో ఉంటూ దొంగల్లా ఏపీకి వచ్చి వెళ్తున్నార’ని ఎద్దేవా చేశారు. తాను హీరోయిన్‌గా 30 ఏళ్లు కష్టపడి సంపాదించానని అవసరమైతే సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ‘లోకేశ్ అనేవాడు రాజకీయంగా పనికిరాడు. లోకేశ్ ఒక బఫూన్. ఒక ఐరన్ లెగ్. పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజే చెట్టంత మనిషి తారకరత్న పడిపోయి ఆస్పత్రిలో ఉన్నాడు. ఇంకోసారి నాపై ఆరోపణలు చేస్తే మహిళలతో కొట్టిస్తా’నంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై లోకేశ్ చెప్తున్న మాటలకు కొట్టడానికి ప్రజలు రెడీ అయ్యారని, కానీ తాను కొట్టొద్దని అడ్డుకున్నానని తెలిపారు. కాగా, అంతకుముందు లోకేష్ నగరిలో మాట్లాడుతూ ‘డైమండ్ పాప అంటే ఫీలవుతున్నారు కాబట్టి ఇక నుంచి జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా’నని వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్‌గా మంత్రి రోజా పైవిధంగా స్పందించారు.