Minister Roja Gives Strong Counter To Balakrishna on the name change of NTR health University
mictv telugu

ప్లూటు బాబు ముందు ఊదు.. జ‌గ‌న్ ముందు కాదు

September 25, 2022

ఏపీలోని విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకు వైసీపీ మంత్రులందరూ వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంత్రులు అంబటి రాంబాబు నుంచి రోజా వరకూ ట్వీట్లు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రి రోజా ట్వీట్ చేస్తూ.. “బాలయ్య.. ప్లూటు బాబు ముందు ఊదు. జ‌గ‌న్ ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు. జ”గన్” అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే.. అని మంత్రి రోజా నందమూరి బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంతకుముందు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడుదల రజని, గుడివాడ అమర్నాథ్, అప్పల్రాజు లు బాలకృష్ణ కామెంట్లకు రీట్వీట్లు చేశారు. వెన్నుపోటు పొడిచిన వారంతా ఎన్టీఆర్ భక్తులమని చెబుతున్నారని.. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్‌పై బురద జల్లుతున్నారని.. ఎంత గొప్ప మనుషులురా మీరు అంటూ విమర్శిస్తున్నారు.